కృష్ణా డెల్టా ప్రాభవాన్ని కోల్పోతుందా? |
రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోవటం తో కృష్ణా డెల్టా లో కూడా 40% మంది రైతులు రెండవ పంట ను సాగు చేయలేకపోయారు. సాధారణంగా వర్షాధార ప్రాంతాల్లో ఉండే కరువు పరిస్థితులు ఇక్కడ కూడా నెలకొన్నాయి. పంటలు వేసిన వారు కూడా బోరు బావులపై వెళ్లదీస్తున్నారు.
కాలువల నుండి సరఫరా లేకపోవటం తో, కృష్ణా జిల్లా లోని 15 మండలాల్లో ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో 22,733 బోరు బావుల కింద 98,426 హెక్టార్లు సాగు చేసారు. పంటల కోసం 13.22 టిఎంసి ల భూగర్భ జలాల్ని పంటల కోసం తోడినట్లు అంచనా. ప్రభుత్వం కూడా 24 గంటల విద్యుత్ సరఫరా తో సహకరించింది. అంతే కాకుండా పట్టిసీమ నుండి పోలవరం కుడి కాలువ ద్వారా 8.80 టిఎంసి ల గోదావరి నీటిని మళ్ళించి సహకరించింది. ఈ పదిహేను మండలాలు అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల, గుడివాడ, కంకిపాడు, మోపిదేవి, మొవ్వ, పామర్రు, పమిడిముక్కల, పెదపారుపూడి, పెనమలూరు, తొట్లవల్లూరు, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మరియు ఉయ్యూరు.

Post a Comment