మాల్య ఏప్రిల్ లో వస్తాడట. ఇప్పుడు మాత్రం రాడట

మాల్య ఏప్రిల్ లో వస్తాడంట. ఇప్పుడు మాత్రం రాడట
మాల్య ఏప్రిల్ లో వస్తాడట. ఇప్పుడు మాత్రం రాడట
మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నుండి తాకీదులు అందుకున్న విజయ్ మాల్య తాను హాజరు కాబోవడం లేదని, తనకు వచ్చే నెల (ఏప్రిల్)  వరకు సమయం కావాలని ఈడీకి తెలియజేశారు. అధికారులు మాత్రం గైర్హాజరుకు మాల్య చూపిన కారణాలను పరిశీలిస్తున్నామని, ఆయనకు మరింత సమయం ఇవ్వొచ్చా  అనే విషయంలో నరియైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా పై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా వున్నాయి. వాటి పై విచారణ కోసమే ఈడీ హాజరుకమ్మంది. మాల్య అధినేతగా ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ దాదాపు 9,000 కోట్ల  రుణ సంక్షోభంలో ఉంది.

SBI, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన విలేపార్లే ప్రాంతంలోని దాదాపు 17,000 చ. అ. విస్తీర్ణంతో ఉన్న  భవంతిని వేలం వేయాలనుకుంటే కనీసం ఒక్క బిడ్ కూడా రాలేదు. కాగా హైనెకెన్ సంస్థ  యునెటైడ్ బ్రూవరీస్ (UB) బోర్డు నుండి కూడా వైదొలగాలని మాల్యాను కోరింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post