ఇండియా సెమీస్ కు చేరేనా?

ఇండియా సెమీస్ కు చేరేనా?
ఇండియా సెమీస్ కు చేరేనా?
ఇప్పటివరకు జరిగిన ఏ 20-20 క్రికెట్ వరల్డ్ కప్ లో నైనా ఉపఖండానికి చెందిన జట్లలో కనీసం ఒక్కటైనా సెమీఫైనల్ చేరింది. 50 ఓవర్స్ వరల్డ్ కప్ ల్లో కూడా 1975  ని మినహాయిస్తే మిగిలిన ఏ వరల్డ్ కప్ లోనైనా కనీసం ఒక ఉపఖండానికి చెందిన జట్టయినా సెమీఫైనల్ లైన్ అప్ లో ఉంది. ఒకవేళ ఇవాళ ఇండియా గెలవకపోతే పొట్టి వరల్డ్ కప్ లో ఇది తొలి సందర్బం అవుతుంది.

మొన్న బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్ లో చచ్చీ చెడీ గెలిచి సెమీస్‌ ఆశల్ని నిలబెట్టుకున్న ఇండియాకు, ఇవాళ మొహాలిలో అసలైన సవాల్‌ ఎదురవబోతుంది. గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే మెరుగైన రన్ రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా నే సెమీస్ చేరుతుంది. ఓడిన జట్టు వరల్డ్ కప్ నుండి నిష్క్రమించాల్సిందే.

వరల్డ్ కప్ లో హాట్‌ ఫేవరెట్‌ అయిన ఇండియా ఇప్పటివరకూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. బౌలింగ్ లో ఫరవాలేదనిపించినా బ్యాటింగ్ లో ప్రభావం చూపలేదు. ఇవాళ ఇండియా బ్యాటింగ్ లో తన స్థాయికి తగ్గట్టుగా రానిస్తే గెలుస్తుంది.  ఇవాళ కూడా జట్టులో మార్పులేమీ ఉండక పోవచ్చు. వర్షం పడే అవకాశం కూడా తక్కువే. పిచ్ స్లోగా ఉండే అవకాశం ఉంది.

0/Post a Comment/Comments