రెండేళ్లలో మార్కెట్లోకి అరకు ఆపిల్స్

రెండేళ్లలో మార్కెట్లోకి అరకు ఆపిల్స్
రెండేళ్లలో మార్కెట్లోకి అరకు ఆపిల్స్
రెండేళ్లలో బహిరంగ మార్కెట్లో అరకు ఆపిల్స్  అమ్ముడవనున్నాయి. CCMB శాస్త్రవేత్తలు ఇక్కడ చింతపల్లి లోని RARS (Regional Agriculture Research Station) లో జరిపిన  ప్రయోగాలు విజయవంతమయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం ఇక్కడి RARS లో 100, అరకు లో 10, జికే వీధిలో 10, లంబసింగి లో 10 ఆపిల్ మొక్కలు నాటి ప్రయోగాలు ఆరంభించారు.

ఈ ప్రయోగాల అధారంగా ఇప్పుడు దాదాపు పదివేల మొక్కలు ఇక్కడి రైతులకు పంపిణీ చేయనున్నారు. వీటికి సంబంధించిన ఎరువులు, పురుగు మందులు కూడా CCMB అధికారులే ఉచితంగా అందించనున్నారు. దీనికి ITDA అధికారులు సహకారం అందించనున్నారు. వీరు ఇక్కడి గిరిజనులకు కాఫీ తోటల పెంపకం లానే, ఆపిల్స్ కూడా విజయవంతమై ఆదాయాన్ని అందిస్తాయని ఆశిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post