ఇక నుండి బ్లాంకెట్లను రోజూ ఉతికించనున్న రైల్వే శాఖ

ఇక నుండి బ్లాంకెట్లను రోజూ ఉతికించనున్న రైల్వే శాఖ
ఇక నుండి బ్లాంకెట్లను రోజూ ఉతికించనున్న రైల్వే శాఖ
ఇండియన్ రైల్వే లో బ్లాంకెట్లను పదిహేను నుండి ముప్పై రోజులకు ఒకసారి ఉతుకుతారు. ఇది సాక్షాత్తు కేంద్ర రైల్వే మంత్రి లోక్ సభలో ఒక సభ్యుడి ప్రశ్న కు చెప్పిన సమాధానమిది. దీనిపైన విమర్శలు వెల్లువెత్తుతుండటం తో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.

ఇక నుండి బ్లాంకెట్లను ప్రతిసారి ఉపయోగించిన వెంటనే ఉతకనున్నారు. రైల్వే శాఖ అధికారి చెప్పిన వివరాల ప్రకారం ప్రయాణికుల నుండి తరచుగా వచ్చే కంప్లైంట్స్ లో బ్లాంకెట్లు వాసన వస్తున్నాయనేది కూడా ఒకటి. ఈ దిద్దుబాటు చర్యల్లో భాగంగా రైల్వే కొత్త వాషింగ్ యూనిట్ల ను ప్రారంభించటం తో పాటు, ఎక్కువ ఉతుకులకు కూడా మన్నేవిధంగా  NIFT కొత్తగా డిజైన్ చేసిన తక్కువ బరువు వున్న మెత్తని బ్లాంకెట్లను ప్రవేశ పెట్టనున్నారు. ఇవి దశల వారీగా ఇప్పటి బ్లాంకెట్లను రీప్లేస్ చేయనున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post