పొంగులేటి సుధాకర్ రెడ్డి వేదాంతం మాట్లాడుతున్నారా?

పొంగులేటి సుధాకర్ రెడ్డి వేదాంతం మాట్లాడుతున్నారా?
పొంగులేటి సుధాకర్ రెడ్డి వేదాంతం మాట్లాడుతున్నారా?
శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు ఉప ఎన్నికలలో విజయం సాధించినంత మాత్రాన అంతా కెసిఆర్ కాలమే నడుస్తుందని ఆయన అనుకుంటే పొరపాటేనని అన్నారు. 

కాలాలు మారుతుంటాయని ఎండా కాలం తర్వాత వర్షాకాలం, ఆ తర్వాత శీతాకాలం వస్తాయని అలాగే కెసిఆర్ కాలం కూడా పోక తప్పదని  తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రకృతి లో కాలభ్రమణం తప్పదని తెలుసుకోవాలనీ, కెసిఆర్ కాలం కూడా ముగియక తప్పదనీ ఆయన అన్నారు. అంతే కాక చాణక్యుడు చెప్పినట్లుగా తియ్యని మాటలు చెప్పి నిజాలను కప్పిపుచ్చే వాళ్లను పట్టుకోవడం కష్టమని అన్నారు. ఇవన్నీ  వింటుంటే పొంగులేటి సుధాకర్ రెడ్డి నిరాశలో ఉన్నారనీ, భవిష్యత్తు పై పెద్ద ఆశలు లేక వేదాంతాన్ని ఆశ్రయించారని అనిపించక మానదు.

0/Post a Comment/Comments

Previous Post Next Post