స్టింగ్ ఆపరేషన్‌తో తృణమూల్ పార్టీ కి చిక్కులు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం 15 రోజుల దూరంలో ఉండగా, కొత్తగా వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్‌ తృణమూల్ పార్జీ సర్కార్‌కు  నిద్రలేకుండా చేస్తోంది. పశ్చిమ బెంగాల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమవుతున్న ఈ వీడియోలు సోషల్  మీడియాలో కూడా ప్రచారంలో వున్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ లో అధికార పార్టీ ఎంపీలు సౌగత్ రాయ్, సుల్తాన్ అహ్మద్, మంత్రి సుబ్రతో  ముఖర్జీ, కోల్‌కతా మేయర్ షోవన్ ఛటర్జీ లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. 

ఈ వీడియో విశ్వసనీయత పై పలు అనుమానాలు ఉన్నప్పటికీ  అధికార తృణమూల్ కాంగ్రెస్ పై ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. నారదన్యూస్‌.కామ్‌ రెండేళ్ల వ్యవధిలో ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ప్రకటించింది. లంచాలకు ప్రతిగా ఈ నేతలు వారికి పలు హామీలు ఇచ్చినట్టు  వీడియోలో రికార్డయ్యింది. రాష్ట్ర బిజెపి పార్టీ ఈ స్టింగ్ ఆపరేషన్ పై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్షాలు మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవి నుంచి దిగిపోవాలని కోరుతున్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post