ఆస్ట్రేలియా పై గెలవాల్సిందే

ఆస్ట్రేలియా పై గెలవాల్సిందే
ఆస్ట్రేలియా పై గెలవాల్సిందే
టీమ్ ఇండియా సెమీఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియా పై ఆదివారం జరగబోయే మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇంకో మార్గమేం లేదు. ఇప్పటికీ రన్ రేట్ మైనస్ లలో ఉండటం తో ఈ పరిస్థితి ఉంది. ఐతే బంగ్లాదేశ్ పై అతి కష్టం మీద చచ్చీ చెడీ గెలిచిన టీమ్ ఇండియా కు ఇది సాధ్యమవుతుందా? అయితే 20-20 లో ఏదైనా సాధ్యమే.

బంగ్లాదేశ్ పై ఓడితే మాత్రం టీమ్ ఇండియా వరల్డ్ కప్ నుండి నిష్క్రమించేది. తొలి మ్యాచ్ లో న్యూజీల్యాండ్ తో భారీ తేడాతో ఓడిపోవటం తో తర్వాత ప్రతి మ్యాచ్ గెలవాల్సిన దుస్థితి లోకి వచ్చింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు వరుసగా గెలిచిన ఇండియా, మరో మూడు మ్యాచ్ లు అంటే వరల్డ్ కప్ ఫైనల్ వరకూ గెలవాల్సిందే. ఎక్కడ ఓడినా ఇక అంతే.

0/Post a Comment/Comments

Previous Post Next Post