విలేఖరిని కొట్టిన సన్నీలియోన్

బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్‌ హోళి వేడుకలలో భాగంగా గుజరాత్ లోని సూరత్ లో "సన్నీ లియోన్‌తో  హోళి" కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆమె ఉంటున్న హోటల్ రూమ్ లోకి ఒక వ్యక్తి బాగా తాగి వచ్చి ఇబ్బంది పెట్టాడట. అతన్ని సన్నీ భర్త డేనియల్ వెబర్ స్వయంగా బలవంతంగా బయటకు పంపించాల్సి వచ్చిందట.

దీని తర్వాత కొంచెం సమయానికి కార్యక్రమానికి హాజరయితే ఒక విలేఖరి  మీరు బాలీవుడ్ హీరోయిన్ కదా.. రాత్రి ప్రోగ్రామ్ కు ఎంత చార్జ్ చేస్తారు అని అడగటం తో బిత్తరపోయిన ఈ బ్యూటీ తనకు తప్పుగా అర్థం అయిందేమోనని మరోసారి అడగమందట. అతను మళ్లీ అదే అడిగేసరికి కోపంతో అతని చెంప పగలగొట్టిందట. విలేఖరులందరినీ బయటకు పంపిస్తే గానీ ఈ షో చేయను అని నిర్వాహకులకు చెప్పటం తో  వాళ్ళు విలేఖర్లని పంపించివేసారట. ఆ తర్వాత షో లో ఈ హీరోయిన్ బాగానే ఆది పాడిందట. ఈ సూరత్ షో వీడియో ఇక్కడ చూడవచ్చు

0/Post a Comment/Comments