ఆదివారం సెలవు కెసిఆర్ కేనా?

ఆదివారం సెలవు కెసిఆర్ కేనా?
ఆదివారం సెలవు కెసిఆర్ కేనా?
ఈ సంవత్సరం తెలంగాణలో బడ్జెట్ సమావేశాలను ఆదివారం కూడా నిర్వహిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం సభకు రాకపోవటం పై గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కు ఉన్న ఆదివారం సెలవు సభ్యులకు వద్దా అని ప్రశ్నించారు. సిఎం రాకుండా ఏదో మొక్కుబడిగా సమావేశాలను నడిపించడం వల్ల లాభం ఏముందని ప్రశ్నించారు. ఇది కేవలం ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అని అన్నారు.

శాసన సభ  లాబీలో తనను కలిసిన రిపోర్టర్స్ తో ఆమె మాట్లాడుతూ ఆదివారం వస్తే కుటుంబసభ్యులతో గడపటమో,  ఇంకా ఎక్కడికైనా వెళ్ళటమో సహజమని అన్నారు.

0/Post a Comment/Comments