తిరుమలగిరి ఆర్మీ సెలక్షన్స్ లో తొక్కిసలాట

తిరుమలగిరి ఆర్మీ సెలక్షన్స్ లో తొక్కిసలాట
తిరుమలగిరి ఆర్మీ సెలక్షన్స్ లో తొక్కిసలాట
సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో ఆర్మీ సెలక్షన్స్ లో తొక్కిసలాట జరిగింది. ఆర్మీ లో 29 క్లర్కు, సుబేదార్ పోస్టులకు సెలక్షన్స్ కోసం అభ్యర్థుల్ని పిలవగా దాదాపు పదివేల మంది వచ్చారు.  తిరుమలగిరి లోని డొక్కా స్టేడియంలో ఈ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం  గేట్లు తెరిచాక ఒక్కసారిగా వేలాది అభ్యర్థులు చొచ్చుకురావడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్మీ సెలక్షన్స్ విషయం పోలీసులకు చెప్పక పోవటం, అభ్యర్థులను అదుపు చేయటానికి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకపోవటం దీనికి కారణాలు గా భావిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post