స్కోచ్ చాలెంజర్ అవార్డ్ ను అందుకున్న కేటీఆర్ |
నేడు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ , ఐటి శాఖా మంత్రి కేటీఆర్ ఢిల్లీ లో పర్యటించారు. ఉదయం 11.45గంటలకు ఢిల్లీ చేరుకున్న మంత్రి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌సింగ్, రవిశంకర్ ప్రసాద్‌తోపాటు పలువురిని కలిశారు. స్టార్ట్ అప్ ల విభాగంలో ప్రతిష్టాత్మక స్కోచ్ చాలెంజర్ అవార్డ్ ను కూడా ఇవాళ మంత్రి కేటీఆర్ అందుకున్నారు.
టీ హబ్‌కు 100 కోట్లు ఇవ్వాలని రవిశంకర్‌ప్రసాద్‌ను కోరామని తెలిపారు.అలాగే ఐటీఐఆర్ కు నిధుల విషయం లో విజ్ఞప్తి చేసామని వివరించారు. పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడును కలిసిన కేటీఆర్ కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ జాబితాలో స్థానం కల్పించాలని కోరామన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచాలని వినతిపత్రం అందచేసారు. మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూమ్, మిషన్ భగీరథ పథకాల కోసం కేంద్ర సహాయాన్ని అభ్యర్థించారు.
కేటీఆర్ తో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. వీరు చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం, భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్ టెక్నాలజీ, అధునాతన పద్దతుల్లో స్లాటర్ హౌస్ నిర్వహించే విధానాలను పరిశీలించనున్నారు.
Skoch Challenger award for Startup India conferred to Mr. @KTRTRS (Hon. IT Minister, Telangana) at #SkochSummit. pic.twitter.com/oau3Kof1lY— Skoch Group (@skochgroup) March 18, 2016
Minister KTR met Union Communications and Information Technology Minister @rsprasad Ji at New Delhi pic.twitter.com/TT6gocdjmP— Min IT, Telangana (@MinIT_Telangana) March 18, 2016
Post a Comment