|
కృష్ణా జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం |
కృష్ణ జిల్లా విజయవాడ లోని గొల్లపూడి దగ్గర సూరయ్యపాలెం లో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ధనుంజయ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం లో నలుగురు మెడికోలు, డ్రైవర్ మృతి చెందారు. మరో ఇరవై మంది మెడికోలు గాయపడ్డారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ కి చెందిన 48 మంది మెడికోలు ప్రమాద సమయంలో బస్సులో వున్నారు. వీరు అమలాపురంలో జరిగిన స్పోర్ట్స్ మీట్లో పాల్గొని హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ దుర్ఘటన జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. మృతుల్ని లక్ష్మణ్, విజయ్, తేజ, ప్రణయ రాజా, క్రిష్ణ మోహన్ గా గుర్తించారు.
Post a Comment