80 నుండి 8 కి

 80 నుండి 8 కి
 80 నుండి 8 కి
ఉల్లిగడ్డ ధరల్లోని హెచ్చు తగ్గులు ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఇవి కిలో 80 రూపాయలకు చేరి వినియోగదారులను ఏడిపించాయి. ధరలు ఎక్కువగా ఉండటం తో ఎక్కువ మంది రైతులు ఉల్లి సాగు చేపట్టారు. మహారాష్ట్రలో కూడా ఉల్లి దిగుబడులు బాగుండటంతో అవి ఇక్కడి మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. దీనితో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

ధరల్లో ఇంత అసాధారణమైన  మార్పుల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు. ధరలు తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వమే రైతులకు మద్దతు ధర ఇచ్చి కొని, నిల్వ చేసి ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగదారులకు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

0/Post a Comment/Comments