ఏనుగుల దాడిలో నలుగురి మృతి

ఏనుగుల దాడిలో నలుగురి మృతి
ఏనుగుల దాడిలో నలుగురి మృతి
పశ్చిమబెంగాల్‌ లోని బర్ధమాన్ జిల్లాలో ఆదివారం ఏనుగులు జరిపిన  దాడిలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఏనుగులు దాల్మ అటవీ ప్రాంతం నుండి దామోదర నదిని దాటి బర్ధమాన్ జిల్లాలోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు.

నసిగ్రామ్ గ్రామంలో తెల్లవారుజామున ఆనందమయి రాయ్, నారాయణ్ చంద్ర మాజి లపై ఏనుగులు దాడిచేసి చంపేశాయి. ఇద్దరికీ దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. బగసొలె గ్రామం లో ప్రకాష్ బోయరా ను, కుసుమ్‌గ్రామ్ గ్రామంలో సిరాజ్ షేక్ ను హతమార్చాయి. వీరి వయసు 40 మరియు 45 సంవత్సరాలు. అటవీ మరియు పోలీసు అధికారులు ఈ ఏనుగులను మళ్లీ అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

0/Post a Comment/Comments