టీ జేఏసీ సమావేశం |
ఇవాళ తెలంగాణ ఐకాస కోర్ కమిటీ (టీ జేఏసీ) సమావేశం జరిగింది. దీనికి ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వం వహించారు. టీ జేఏసీ నుండి ఉద్యోగ సంఘాలు బయటకు వెళ్ళిపోవటం తో కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జేఏసీ భవిష్యత్ కార్యక్రమాలపై సమాలోచనలు జరిపారు.
సమావేశం ముగిసిన తరవాత కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగులతో టీ జేఏసీకి ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని అన్నారు. అలాగే సెక్షన్-8 పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీర్మానం హాస్యాస్పదంగా వుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం టీ జేఏసీ కొనసాగుతుందని, ప్రజా సమస్యలపై ఎప్పటికీ పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు. త్వరలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రెండు తెలుగు రాష్ట్రాలు రెండూ ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్ర ఆదిపత్యం కోరుకుంటున్నాయంటూనే, తాము పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై కూడా పోరాడుతామన్నారు.

Post a Comment