తెలంగాణ ఎంసెట్ కు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సెంటర్లు

తెలంగాణ ఎంసెట్ కు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సెంటర్లు
తెలంగాణ ఎంసెట్ కు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సెంటర్లు
ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ ను తమ రాష్ట్రంలోనే వ్రాయనున్నారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని తెలంగాణ మన్నించింది. విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి మరియు కర్నూలు లలో పరీక్షా కేంద్రాలు ఉండనున్నాయి. తెలంగాణా ఉన్నత విద్యా మండలి (TSCHE)  మరియు జెఎన్టియు హైదరాబాద్ (JNTU-H) అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.

గత సవత్సరం 42,106 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ కు హాజరయ్యారు. దీనిలో మెడికల్ ఎంట్రన్స్ కే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గుచూపారు. వీరుకాకుండా  9,651 ఇతర రాష్ట్ర విద్యార్థులు కూడా హాజరయ్యారు. వీరు, ఆంధ్రా విద్యార్థులు నాన్ లోకల్ కోటా లో వుండే 15% సీట్ల కోసం పోటీ పడతారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post