బాహుబలి చిత్రానికి శాసనసభ అభినందన

బాహుబలి చిత్రానికి శాసనసభ అభినందన
బాహుబలి చిత్రానికి శాసనసభ అభినందన
63 వ జాతీయ అవార్డులలో తెలుగు చిత్రం బాహుబలి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికవటాన్ని తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా అభినందించింది. ఒక తెలుగు సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికవటం ఇదే తొలిసారి కావటం విశేషం.  తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ గారు మాట్లాడుతూ సభ తరపున సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక అభినందన తీర్మానాన్ని ఆమోదించింది.

ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్ర రెండవ భాగం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. గతంలోని తెలుగు సినిమాలలో జాతీయ స్థాయిలో నర్తన శాల చిత్రం రెండవ ఉత్తమ చిత్రంగా ఎంపికవగా, శంకరాభరణం చిత్రం అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికయింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post