ఉత్తరాఖండ్‌లో కేంద్రానికి ఎదురు దెబ్బ |
రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతి పాలనపై స్టే విధించటంతో హరీష్ రావత్ ప్రభుత్వానికి ఊరట లభించింది. అంతేకాకుండా ఈనెల 31వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
స్పీకర్ బిజెపి కి మద్దతిస్తున్న తొమ్మిది మంది సభ్యులను సస్పెండ్ చేయటంతో విశ్వాస పరీక్ష లో కాంగ్రెస్ సర్కారు నెగ్గే అవకాశం కనిపిస్తుంది. సభలో మొత్తం 70 మంది సభ్యులుండగా 9 మంది సస్పెన్షన్ కు గురవటం తో విజయానికి 31 మంది సభ్యుల అవసరం ఉంటుంది. కాంగ్రెస్ కు ఇప్పుడు 27 మంది సభ్యులుండగా, ఆరుగురు ఇండిపెండెంట్ల మద్దతు ఉందని చెప్పుకుంటున్నారు.

Post a Comment