ఐఫోన్‌ను బ్రేక్ చేసిన ఎఫ్‌బీఐ

ఐఫోన్‌ను బ్రేక్ చేసిన ఎఫ్‌బీఐ
ఐఫోన్‌ను బ్రేక్ చేసిన ఎఫ్‌బీఐ
ఉగ్రవాది ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు నిరాకరించిన ఆపిల్ కు ఎఫ్‌బీఐ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఆ సంస్థ సహాయం లేకుండానే ఆ ఫోన్ ని ఎఫ్‌బీఐ అన్‌లాక్ చేయగలిగింది.

కాలిఫోర్నియాలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాది ఫారూక్ ఐఫోన్‌ 5c ను చేజిక్కించుకున్న ఎఫ్‌బీఐ, అతని ఫోన్ లోని అడ్రస్ బుక్, ఇతర విషయాలను తెలుసుకోవటానికి ఆపిల్ సంస్థను సంప్రదించింది. దానికి సంస్థ నిరాకరించటం తో ఎఫ్‌బీఐ కోర్టుకెక్కింది. అయితే థర్డ్ పార్టీ సహాయంతో తాము ఐఫోన్‌ను అన్‌లాక్ చేయగలిగామని ఇప్పుడు కోర్టుకు తెలిపి వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంది.

ఆపిల్ సంస్థ మాత్రం ఇలా ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడం సరైన పద్ధతి కాదనీ  స్పష్టం చేయటమే కాకుండా మరింత  భద్రత తో కూడిన సాఫ్ట్‌వేర్‌ను తమ కస్టమర్ల వ్యక్తిగత సమాచారం కోసం తయారుచేస్తామని పేర్కొంది.

Update:

ఆపిల్ సంస్థ ఎఫ్‌బీఐకి భవిష్యత్తులో ఉపయోగించుకోవటానికి వీలుగా ఫోన్ అన్‌లాక్ చేసే సాంకేతికతను అందించాల్సింది గా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చాలా రోజులుగా ఇందుకు నిరాకరిస్తూ వచ్చిన ఆపిల్  యాజమాన్యం తప్పనిసరి పరిస్థితులలో అన్ లాక్ చేయడానికి కొత్త ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఎఫ్‌బీఐకి ఇచ్చేందుకు అంగీకరించింది. 

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget