ముందస్తు చెల్లింపుదారులకు 8 శాతం పన్ను మినహాయింపు |
తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 33 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఇది గత సంవత్సర వసూళ్ళ కంటే ఏకంగా 12వేల కోట్ల రూపాయలు అధికం కావటం విశేషం. తర్వాత వాయిదాలలో చెల్లించే వారికన్నా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే సంస్థలకు 8 శాతం మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇంకా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం దాదాపు 12 కోట్ల ఖర్చుతో 14 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. అంతే కాక ఖాళీలను TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు, జిల్లాకో ఐటీ డిప్యూటీ కమిషనర్ ను నియమించనున్నారు.

Post a Comment