అపోలో ఫార్మాలో కూడా ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ

అపోలో ఫార్మాలో కూడా ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ
అపోలో ఫార్మాలో కూడా ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కున్న వస్తువులను మీకు దగ్గరలో వుండే అపోలో ఫార్మా లో కూడా డెలివరీ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఫ్లిప్ కార్ట్ సంస్థ యొక్క డెలివరీ విభాగమైన ఇ-కార్ట్  300 అపోలో ఫార్మాలలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టటానికి  ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తు లో ఈ సంఖ్యను మరింతగా పెంచే యోచనలో ఫ్లిప్ కార్ట్  వున్నట్లుగా సమాచారం. దీనివల్ల ఫ్లిప్ కార్ట్ కు కూడా సమయం ఆదా కానుంది.

ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఇంటి చిరునామాను ఇస్తే ఒక్కొక్కసారి మనం ఇంటి దగ్గర ఉండకపోవటం, డెలివరీ బాయ్స్‌కు మనం ఇచ్చిన చిరునామా దొరక్కపోవటం లాంటి కష్టాలు కూడా ఉంటుంటాయి. ఇకపై ఇటువంటి ఇబ్బందుల్లేకుండా  ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ వినూత్న చర్యలు చేపట్టింది. బుక్ చేసిన వస్తువులను మనకు దగ్గరలో  అందుబాటులో వుండే అపోలో ఫార్మాలో కూడా తీసుకోవచ్చు.  అపోలో ఫార్మా 24 గంటల సర్వీసు అందిస్తోంది కాబట్టి బుక్ చేసుకున్న కస్టమర్ ఏ సమయంలో వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఉండనుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post