రష్యా లో విమాన ప్రమాదం 61 మంది మృతి |
దక్షిణ రష్యా లోని రోస్తోవ్-ఆన్-డాన్ (Rostov-on-Don) ఎయిర్ పోర్ట్ లో ఒక బోయింగ్ 737 విమానం లాండింగ్ సమయంలో కూలిపోయింది. ఫ్లైదుబాయ్ 981 గా పిలవబడే ఈ విమానం దుబాయ్ నుండి వచ్చింది. దీనిలో 55 మంది ప్రయాణికులతో సహా మొత్తం 61 మంది ఉన్నారు. ప్రమాదంలో అందరూ చనిపోయినట్టు రష్యన్ అధికార వార్తా సంస్థ టాస్ (Tass) తెలియచేసింది. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు జరిగింది.
వర్షం పడుతుండటం తో రన్ వే సరిగ్గా కనిపించక పోవటం తోనే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. రన్ వే నుండి దూరంగానే రెండుసార్లు లాండింగ్ కోసం ప్రయత్నించి భూ ఉపరితలాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

Post a Comment