సింగరేణి మొదటి దశ 600 మెగావాట్ల యూనిట్ గ్రిడ్ కు అనుసంధానం

సింగరేణి మొదటి దశ 600 మెగావాట్ల యూనిట్ గ్రిడ్ కు అనుసంధానం
సింగరేణి మొదటి దశ 600 మెగావాట్ల యూనిట్ గ్రిడ్ కు అనుసంధానం
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని పెగడపల్లి వద్ద నిర్మించిన  సింగరేణి మొదటి దశ  అయిన 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ను ఇవాళ గ్రిడ్ కు అనుసంధానం చేసారు. ఇవాళ ఆదివారం రోజు జరిగిన ఈ కార్యక్రమానికి సింగరేణి సిఎమ్డి శ్రీధర్, సింగరేణి, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలలో ఈ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అధికారికంగా ప్రారంభించనున్నారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి కావటం మరియు గ్రిడ్ అనుసంధానం విజయవంతమవటం తో అధికారులను శ్రీధర్ అభినందించారు.

సింగరేణి విద్యుత్ ఉత్పత్తి వాణిజ్య పరంగా మొదలైతే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న విద్యుత్ లోటు ఘననీయంగా తగ్గగలదని భావిస్తున్నారు. రెండవ దశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (600 మెగావాట్) కూడా మే నెలలో విద్యుదుత్పత్తిని ప్రారంభించనుంది. మూడవ దశ యూనిట్ (600 మెగావాట్) కు కూడా ఈ మధ్యనే శంకుస్థాపన జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post