విద్యుత్ వెలుగుల దిశగా తెలంగాణ రాష్ట్రం

విద్యుత్ వెలుగుల దిశగా తెలంగాణ రాష్ట్రం
విద్యుత్ వెలుగుల దిశగా తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ జెన్ కో 2018 - 2019 నాటికి రాష్ట్రానికి మరో 5880 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ని జత చేయనుందని విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ శాసన సభ లో ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం గా తెలియచేసారు.

మంత్రి చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణ జెన్ కో 5880 మెగావాట్ల థర్మల్ విద్యుత్ తో పాటు, 2500 మెగావాట్ల సోలార్ పవర్, 360 మెగావాట్ల జల విద్యుత్, 1800 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్, 4000 మెగావాట్ల ఎన్టీపీసి విద్యుత్, 1000 మెగావాట్ల ఛత్తీస్ ఘడ్ విద్యుత్ అందుబాటులోకి రానున్నాయి.

ఈ 5880 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కోసం అయ్యే ఖర్చు వివరాలు ఈ విధంగా ఉండనున్నాయి.

1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ -  7,290.60 కోట్లు
800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ప్లాంట్ -  5548.44 కోట్లు
4000 మెగావాట్ల యాదాద్రి  థర్మల్ విద్యుత్ ప్లాంట్ -  25,099.42 కోట్లు

0/Post a Comment/Comments

Previous Post Next Post