మూతపడనున్న 40 ఇంజనీరింగ్ కాలేజీలు

మూతపడనున్న 40 ఇంజనీరింగ్ కాలేజీలు
మూతపడనున్న 40 ఇంజనీరింగ్ కాలేజీలు
ఈ సంవత్సరం తెలంగాణ లో దాదాపు 40 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడనున్నాయి. తక్కువ సంఖ్యలో వున్న విద్యార్థులు, రాష్ట్ర ప్రభుత్వ కఠిన నిబంధనలు దీనికి కారణంగా తెలుస్తోంది.  అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) కి, ఈ కాలేజీలు మూసివేతకై దరఖాస్తు చేసుకున్నాయి. ఒకసారి ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బకాయిలు వచ్చేస్తే మరిన్ని కాలేజీలు మూతపడతాయని భావిస్తున్నారు.

రాష్ట్రంలో మరో 300 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వాటిల్లో సీట్ల సంఖ్యను తగ్గించుకోవటానికి దరఖాస్తు చేసుకున్నాయి. 2015-16 విద్యా సంవత్సరానికి తెలంగాణాలో కన్వీనర్ కోటా కింద 228 కాలేజీల్లో 86,313 సీట్లు వుండగా, కేవలం 53,347 సీట్లు మాత్రమే నిండాయి. 5 కాలేజీల్లో అసలు విద్యార్థులే రాకపోగా, 29 కాలేజీలలో పదికి లోపు విద్యార్థులు మాత్రమే జాయినవటం పరిస్థితిని తెలియజేస్తుంది. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించటం కాలేజీల మూసివేతలకు ఒక కారణంగా అనుకుంటున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post