![]() |
పాక్‌కు ఎఫ్-16 ఫైటర్‌ల ఎగుమతికి అమెరికా సెనేట్ ఆమోదం |
పాకిస్థాన్‌కు ఎనిమిది ఎఫ్-16 ఫైటర్ జెట్‌ల విక్రయానికి వ్యతిరేకంగా అమెరికా సెనేటర్ రాండ్ పౌల్ ప్రవేశ పెట్టిన తీర్మానం 24-71 ఓట్లతో వీగిపోయింది. దీనితో ఎఫ్-16 ఫైటర్ జెట్‌ల ఎగుమతికి ప్రధాన అడ్డంకి తొలగినట్లయింది. రాండ్ పాల్ తీర్మానానికి మద్ధతు ప్రకటించిన వారిలో 12 మంది డెమోక్రాట్లు, 12 మంది రిపబ్లికన్లు ఉన్నారు.
అయితే తీవ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ సైన్యాన్ని బలోపేతం చేయటానికి ఉద్దేశించిన 699 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని మాత్రం అమెరికా సెనేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ దేశ పన్ను చెల్లింపుదారుల డబ్బును పాక్ సైన్యం బలోపేతానికి వినియోగించడమేంటని ప్రశ్నించారు.

Post a Comment