ఒకే రోజు ఇన్ని సినిమాలా? |
ఏప్రిల్ రెండవ వారం నుండి పెద్ద సినిమాలు వరుసగా విడుదలవుతుండటంతో ఈ వారం లోనే చిన్న సినిమాలన్నీ విడుదలవుతున్నాయి. ఈ వారంలో ఏకంగా 14 సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాల విడుదల విషయంలో ఇది ఒక రికార్డుగా చెబుతున్నారు.
రాంగోపాల్ వర్మ ఎటాక్ కూడా ఈ సినిమాలలో భాగంగా ఏప్రిల్ 1 న రానుంది. ఈ సినిమాలో మంచు మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ నటించారు. నారా రోహిత్ నటించిన సావిత్రి కూడా ఇదే రోజు రానుంది. ఇవే కాకుండా ఇదేరోజు పిడుగు, 7 టు 4, అప్పుడలా ఇప్పుడిలా, ఆమె ఎవరు, భరతన్న, ఓ మల్లి, రహదారి, 24 అవర్స్, ధనాధన్ వంటి చిన్న తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి.
ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే శర్వానంద్, నిత్యామీనన్లు జంటగా నటించిన రాజాధిరాజా, సెల్వరాఘవన్ భార్య గీతాంజలి నిర్మించిన నన్ను వదిలి నీవు పోలేవులే మరియు ధనుష్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన మాస్ సినిమాలు కూడా ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదలైతే వాటికి సినిమా హాళ్ళు లభిస్తాయా? లభించినా ప్రేక్షకులు చూస్తారా? ఇలా ఇన్ని ఒకేసారి విడుదల అయితే కొన్ని మంచి సినిమాలు కూడా ఎవరూ చూడకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

Post a Comment