రోడ్ల పైకి గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు |
అమెరికా లోని సిలికాన్ వ్యాలీ రోడ్లపై గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు పరుగులు తీస్తున్నాయి. ఈ కార్లు వాహన రంగం లో పెను మార్పులకు నాంది కాగలవని నిపుణులు భావిస్తున్నారు. గూగుల్ సంవత్సరం క్రితమే ఈ కార్లను తయారు చేసినప్పటికీ ప్రైవేటు టెస్టింగ్ ట్రాక్స్ పైనే ఇన్నాళ్ళు టెస్టింగ్ చేసారు. 2 సీట్ల సామర్థ్యం గల pod లాంటి ఈ కార్లు జనసమ్మర్ధమున్న రోడ్ల పైన తిరగటం ఇదే ప్రథమం.
గూగుల్ గత కొన్ని సంవత్సరాల నుండి లెక్సస్, టయోటా కార్లలో డ్రైవర్ లెస్ టెక్నాలజీని పరీక్షించింది. ఈ కొత్త కార్లలో స్టీరింగ్ వీల్ మరియు బ్రేక్ పెడల్ లాంటి సౌకర్యాలేంలేవు. తొలి పరీక్షల సమయం లో వాటిని ఉపయోగించినప్పటికీ తర్వాత తొలగించారు. అత్యవసర సమయంలో మనుషులు ఈ కార్లని కంట్రోల్ లోకి తీసుకునే విధంగా వీటిని రూపొందించారు. ఇప్పుడు కేవలం 25 కార్లు మాత్రమే రోడ్లపై ఉన్నప్పటికీ భవిష్యత్తు లో అన్ని అనుమతులు వచ్చాక పూర్తిస్థాయిలో వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేయనుంది.
Post a Comment