ఆరుద్ర పురుగు

ఆరుద్ర పురుగు
ఆరుద్ర పురుగు
ప్రతి సంవత్సరం ఆరుద్ర కార్తె సమయంలో పల్లెల్లో కనిపించే అందమైన ఎర్రని పురుగుల్ని ఆరుద్ర పురుగులు గా వ్యవహరిస్తారు. యేటా తొలకరి సమయంలో ఇవి గుంపులు గుంపులుగా తిరుగాడుతుంటాయి. ఇవి మృదువుగా వుండి ముట్టుకుంటే వెల్వెట్ వస్త్రంలా మెత్తగా అనిపిస్తాయి. చూడగానే పట్టుకోవాలనిపించేంత ముద్దుగా అందంగా కదిలే బొమ్మల్లా ఉంటాయి. పురుగులంటే భయపడే చిన్న పిల్లలు సైతం ఈ ఆరుద్రపురుగుల్ని పట్టుకుంటారు. మనం ముట్టుకుంటే చాలు అవి ముడుచుకుంటాయి. కాసేపు ఏ కదలికా లేకుండా ఉంటే మెల్లగా నడవడం మొదలెడతాయి.

ఆంగ్లం లో Red velvet mite గా పిలిచే ఈ ఆరుద్ర పురుగులు పర్యావరణ నేస్తాలు. ఇవి నేలను గుల్లబారేలా చేసి పంటలకు పోషకాలు అందటం లో సహాయం చేస్తాయి. ఇవి కనిపించటాన్ని రైతులు శుభ సూచకం గా భావిస్తారు. వీటిని సాంకేతికం గా Trombidium grandissimum పేరుతో వ్యవహరిస్తారు. కొంతమంది Coccinella septempunctata ని ఆరుద్ర పురుగులు గా పొరపడుతుంటారు. క్రింది చిత్రాల్లో రెంటినీ గమనించవచ్చు.

Trombidium grandissimum
Trombidium grandissimum
Coccinella septempunctata
Coccinella septempunctata

ఇంత విశిష్టత కలిగిన ఈ ఆరుద్ర పురుగులు నెమ్మదిగా అంతరించే దశకు చేరుకుంటున్నాయి. పొలాల్లో మితిమీరిన క్రిమిసంహారకాల వాడకం దీనికి ముఖ్య కారణం. ఈమద్య కాలంలో మరో ప్రమాదకరమైన ధోరణి ఛత్తీస్ గడ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటుంది. ఈ పురుగుల్ని  కిలోల లెక్కన కొనే ఏజెంట్లు బయలుదేరారు. వీటినుంచి  సేకరించే నూనెను పక్షవాతం రోగులకు వాడే తైలం లోనూ, లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆయుర్వేద మందుల తయారీలోనూ వాడుతారు. అరబ్ దేశాలలో వాడే పాన్ లో కూడా ఈ పురుగుల్ని వాడుతారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post