తెలంగాణా లో 20MW సోలార్ విద్యుత్ కేంద్రం ప్రారంభం

First Solar commercial operations begins
20MW సోలార్ విద్యుత్ కేంద్రం
  • అమెరికా కు చెందిన ఫస్ట్ సోలార్ సంస్థ చే జూన్ 25నుండి వాణిజ్య సరళి లో ఉత్పత్తి
  • TSSPDCL తో 20 సంవత్సరాల కాలానికి ఒప్పందం
అమెరికా కు చెందిన ఫస్ట్ సోలార్ సంస్థ తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా మరికల్ గ్రామం లో 20MW విద్యుదుత్పత్తి ని వాణిజ్య సరళి లో ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కేంద్రం లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను తెలంగాణా దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ కు యూనిట్ కు 6.49 రూపాయలకు అమ్మేలా  20 సంవత్సరాలు చెల్లుబాటయ్యే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఫస్ట్ సోలార్ సంస్థ MD సుజయ్ ఘోష్ తెలియ చేసిన వివరాల ప్రకారం ఈ సంస్థ భారత దేశం లో 200MW  విద్యుదుత్పత్తిని లక్ష్యం గా చేసుకుంది. తెలంగాణా లో కూడా ఒప్పందం ప్రకారం మరో 25MW విద్యుదుత్పత్తి ని త్వరలో ప్రారంభించనుంది. ఇది దేశంలో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటం లో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post