ఢిల్లీ లో భాజపాది ఆత్మహత్యా?

ఢిల్లీ లో భాజపాది ఆత్మహత్యా?
ఢిల్లీ లో భాజపాది ఆత్మహత్యా?
  • ఆర్భాటం, అతివిశ్వాసం, విద్వేష ప్రచారాలే ఓటమికి కారణాలా?
  • కిరణ్ బేడికి కేడర్ సహకరించలేదా?
ఎన్నికలకు సరిగ్గా నెల ముందు వరకు ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో భాజపా సునాయాస విజయాన్ని సాధిస్తుందనే చెప్పాయి. ఆ తర్వాతే ఆప్ క్రమంగా పుంజుకుంది. ఎన్నికల ముందు  ఒపీనియన్ పోల్స్ భాజపా బొటాబొటి విజయం సాధిస్తుందని తెలిపాయి. ఎన్నికలు జరిగిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్ విజయం సాధిస్తుందని ఊహించాయి. కానీ ఆప్ మాత్రం అవి ఊహించిన దానికన్నా భారీవిజయం సాధించింది. ఒక్క నెలలో అసలేం జరిగింది. ఫలితాల్లో మార్పులన్నీ ఒక్క నెలలోనే జరిగిపోయాయా?

లోక్ సభ ఎన్నికల్లో విజయం తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించటంతో భాజపా శ్రేణులలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. వారంతా మోడీ-షా జోడి కి ఎదురులేదనే భావించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు పెద్దగా ప్రచారం జోలికే వెళ్ళలేదు. దానికి భిన్నంగా ఆప్ గత ఎన్నికల తర్వాత ప్రజల మధ్యే వుండి వారి అవసరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఢిల్లీ డైలాగ్ పేరిట ప్రజల్లో నిరంతర చర్చా కార్యక్రమాలు నిర్వహించింది.

ఈ ఎన్నికలలో విజయం కోసం దేశ వ్యాప్తంగా వున్నా RSS, భాజపా కార్యకర్తలను, ఎంపీలను మరియు కేంద్ర మంత్రులను మోహరించింది. ఇది అతి ప్రచారంగా, ఆర్భాటంగా కనిపించింది. భాజపా నాయకులంతా ఆప్ అధినేత కేజ్రివాల్ ని లక్ష్యం గా చేసుకొని విమర్శలు గుప్పించారు. అది అనుకూలమైనా, వ్యతిరేకమైనా ప్రచారం మొత్తం కేజ్రీ చుట్టూనే జరిగింది. చివరకు నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ సైతం కేజ్రీ కి వ్యతిరేకంగా విమర్శలు చేయటం ఆయన స్థాయి ని అమాంతం పెంచేసాయి. దీనికి పూర్తి భిన్నంగా ఆప్ పార్టీ భాజపాకి గానీ, ఆ పార్టీ నాయకులకు గానీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. 49 రోజుల పాలన తర్వాత బాధ్యతల నుండి తప్పుకున్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పటమే కాకుండా, ఆ 49 రొజులలో ఏం చేసారో, అయిదు సంవత్సరాలు అవకాశం ఇస్తే ఏం చేస్తారో వివరించారు. గత ఎనిమిది నెలలుగా భాజపా పాలన ఆశించినంత గొప్పగా లేకపోవటం, ఆప్ ప్రవర్తన హుందాగా వుండటం కలిసొచ్చాయి.

ఢిల్లీ భాజపాలో కేజ్రీ స్థాయి అభ్యర్థి లేకపోవటం, గత ఎన్నికల్లోని ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ కేంద్రమంత్రి పదవిలో ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అధినాయకత్వం కిరణ్ బేడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిపింది. ఆకస్మికంగా పార్టీ లోకి వచ్చిన బేడి ముఖ్యమంత్రి అభ్యర్థి కావటం సహజం గానే శ్రేణులకు రుచించలేదు. దానితో అవి మనస్పూర్తిగా సహకరించలేదనే వాదనలు సైతం వినిపించాయి.

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget