విడుదలైన శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ |
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లో కలిపి మొత్తం నాలుగు శాసనమండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, తెలంగాణా కు చెందిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు సంబందించిన మండలి సభ్యత్వం మార్చ్ 29న ముగియనున్న నేపథ్యం లో ఈ షెడ్యూల్ విడుదల అయింది.
ఫిబ్రవరి 19 న ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చ్ 16న ఎన్నికలు జరగనున్నాయి. లెక్కింపు మరియు ఫలితం మార్చ్ 19న వెలువడనున్నాయి.
ఎన్నికలు జరిగే నియోజకవర్గాల వివరాలు
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం
కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం
Post a Comment