స్మార్ట్ సిటీ గా విశాఖపట్నం |
- అమెరికా వాణిజ్య అభివృద్ధి మండలి తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
- ఈ ఒప్పందం మరియు నిధులు అధ్యయనానికే, స్మార్ట్ సిటీ కి కాదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అమెరికా వాణిజ్య అభివృద్ధి మండలి (USTDA) రాష్ట్రం లో స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం ఒప్పందం (MOU) కుదుర్చుకున్నాయి. రాష్ట్రం లోని పట్టణాలను ముఖ్యం గా విశాఖపట్నం ను స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేసే విషయమై ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం అమెరికా వాణిజ్య అభివృద్ధి మండలి విశాఖ ను స్మార్ట్ సిటీగా ఎలా రూపొందించాలి అనే విషయం పై అధ్యయనానికి నిధులు సమకూరుస్తుంది. ఈ కార్యక్రమం లో భాగంగా వివిధ రకాల పరిశోధనలు నిర్వహించటం, వర్క్ షాప్ లు నిర్వహించటం మరియు శిక్షణ కార్యక్రమాలు వుంటాయి. ఈ విషయమై ఇతర అమెరికా ప్రభుత్వ సంస్థలు, ఎక్జిం బ్యాంకు అవసరమైన సహాయం అందిస్తాయి.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మరియు ఇతర అమెరికా అధికారుల సమక్షం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి IYR కృష్ణారావు, మరియు అమెరికా వాణిజ్య అభివృద్ధి మండలి డైరెక్టర్ లియోకడియా ఐజాక్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని గొప్ప ముందడుగు గా అభివర్ణించారు.

Post a Comment