మనది కాకపొతే......

మనది కాకపొతే
మనది కాకపొతే
అధికారం మనది కాకపొతే ఏమైనా చెప్పొచ్చు అనుకుంటారు రాజకీయ నాయకులు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాటలు అలానే వున్నాయి.

TRS ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడు నెలలు దాటిపోయాయి. ఇంకా హామీలన్నీ నెరవేర్చలేదు అని ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటూ వుంటాడు. ఇలాంటి వ్యక్తి 2004 లో కాంగ్రెస్ తెలంగాణా హామీ ఇచ్చి 2014 వరకు ఇవ్వలేదన్న సంగతి మర్చిపోయాడు.

రాజయ్య గారి బర్తరఫ్ గురించి మాట్లాడుతూ ఇది దళితులందరికీ అవమానం. ఒక దళిత వ్యక్తి ని ఎలా బర్తరఫ్ చేస్తారు. దీని వెనక వున్న రహస్యాల్ని బయటపెట్టాలి అంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం శంకరరావు గారిని బర్తరఫ్ చేసినప్పుడు దళితులపై ప్రేమ వున్న ఈ వ్యక్తి కనీసం స్పందించలేదు.

0/Post a Comment/Comments

Previous Post Next Post