మెట్రో అలైన్ మెంట్ మార్పు తో ప్రభుత్వానికి అదనపు భారం ఉండదా?

మెట్రో అలైన్ మెంట్ మార్పు
మెట్రో అలైన్ మెంట్ మార్పు
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాలలో మెట్రో రూట్ మార్పులను పరిశీలించవలసింది గా HMR (హైదరాబాద్ మెట్రో రైల్ కార్ప్) ను అభ్యర్థించింది. వీరు తెలిపిన వివరాల ప్రకారం ఇది ఆర్థికం గా అసలు భారం కాదని తెలుస్తోంది.

ఈ రూట్ మార్పు వల్ల దాదాపు 2000 కోట్ల అదనపు భారం పడుతుందని L&T వర్గాలు ప్రాథమికంగా అంచనా వేసాయి. కాని ఇది కేవలం 800 కోట్లేనని HMR వర్గాలు తెలిపాయి.

సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాలలో రూట్ మార్పు తో దూరం స్వల్పం గా తగ్గనుంది. అయితే చర్చ అంతా పాతబస్తీ రూట్ మార్పు పైనే కేంద్రీకృతమైంది. ఎందుకంటే ఇక్కడ రూట్ మార్పుతో దూరం 3.2 కిలో మీటర్లు పెరగనుంది. మెట్రో నిర్మాణానికి కిలో మీటరు కు వ్యయం దాదాపు 200 కోట్లు గా అంచనా వేసింది. పాత రూట్ ప్రకారం 960 నిర్మాణాలను కూల్చవలసి వుండేది. వీటికోసం 400 కోట్లను గత ప్రభుత్వం కేటాయించింది. కానీ కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఈ వ్యయం 800కోట్లకు పెరగనుంది. HMR నివేదిక ప్రకారం ఈ 800 కోట్ల వ్యయాన్ని కి మళ్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం పై అదనపు భారం అసలు ఉండదని ఈ నివేదిక తేల్చింది.

L&T కూడా దీనికి అంగీకరించే అవకాశం వుంది. పెరిగిన 3.2 కిలో మీటర్ల దూరం లో 2-3 కొత్త స్టేషన్లు వచ్చే అవకాశం తో పాటు, కొత్త రూట్ MMTS లేని ప్రాంతం లోంచి వెళ్లనుంది. ఇది L&T కి కూడా లాభదాయకం.

0/Post a Comment/Comments

Previous Post Next Post