T - Hub ఇండియా లోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం

T - Hub ఇండియా లోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం
T - Hub ఇంక్యుబేషన్ సెంటర్
  • రానున్న 6సంవత్సరాల కాలంలో 600కోట్ల పెట్టుబడి
  • తొలిదశలో 60వేల చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు
తెలంగాణా ఐటిశాఖా మంత్రి KTR ఈ రోజు IIIT గచ్చిబౌలి ప్రాంగణం లో ఇండియా లోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ కు శంకుస్థాపన చేసారు. 35కోట్ల తో 5అంతస్తులలో 60వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో నిర్మితం కానున్న ఈ భవనం 400 స్టార్ట్-అప్ కంపెనీలకు వేదిక కానుంది. ఈ భవనం 3000 ఉద్యోగాలు కల్పించగలదని ఆశిస్తున్నారు. T-Hub గా పిలవబడే ఈ ప్రాంగణం 2017 తర్వాత ఇతర ఇంక్యుబేటర్ల ఏర్పాటు కు సహకారం అందించనుంది.

T -Hub లో ముఖ్యంగా 3రకాల సేవలు అందించనున్నారు.

Launch Pad గా పిలవబడే మొదటి దశ లో ఔత్సాహికుల నుండి ఐడియాలు స్వీకరిస్తారు.
Accelerator గా పిలవబడే రెండవ దశలో ఎంపిక చేయబడిన ఐడియాలకు తగిన ఆర్థిక, స్థల మరియు రిజిస్టర్  చేయటానికి కావలసిన సహాయం చేస్తారు.
propeller గా పిలవబడే మూడవ దశలో స్టార్ట్-అప్ లకు కావాల్సిన సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలు అందచేస్తారు.

IIIT, ISB మరియు నల్సార్ సంస్థలు వీటికి కావాల్సిన సాంకేతిక, మార్కెటింగ్ మరియు న్యాయ సహాయాలు అందచేస్తాయి. రెండవ దశ T-Hub రాయిగుడెం లో 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. రానున్న 6 సంవత్సరాల కాలం లో ప్రభుత్వం 600కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రైవేటు వెంచర్ కాపిటలిస్టు లతో కలిసి సంయుక్త నిధి కూడా ఏర్పాటు చేయనుంది. 2020 వరకు కనీసం 1000 కంపెనీలకు సహాయం అందించటం లక్ష్యం గా పనిచేయనుంది.

T -Hub కి చైర్మన్ గా హర్ప్రీత్ సింగ్ (ఐటి సెక్రటరీ - తెలంగాణా ప్రభుత్వం) వ్యవహరించనున్నారు. డైరెక్టర్లు గా BVR మోహన్ రెడ్డి (చైర్మన్ -Cyient ), శశి రెడ్డి (Sri capital) మరియు CP గుర్నాని ( చైర్మన్ -Tech మహీంద్రా ) వ్యవహరించనున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post