66వ జాతీయ ఫార్మారంగ సదస్సు

66వ జాతీయ ఫార్మారంగ సదస్సు
66వ జాతీయ ఫార్మారంగ సదస్సు
  • అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత పెంపుపై దృష్టి
  • 6000 ప్రతినిధులు,100మంది సీఈఓ ల హాజరు
66వ జాతీయ ఫార్మారంగ సదస్సు హైదరాబాద్ లోని హైటెక్స్ లో శుక్రవారం ప్రారంభమై 3రోజులపాటు కొనసాగనుంది. పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణా ప్రభుత్వం ఈ సదస్సు ను హైదరాబాద్ లో పెట్టుబడులను ఆకర్షించటానికి ఉపయోగించనుంది.

ఈ సదస్సు ముఖ్యంగా ఫార్మా ఉత్పత్తి విధానాలు, ఉత్పత్తుల నాణ్యత పెంచటం, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించటం కొత్త సాంకేతిక విధానాలను ఉపయోగించటం ప్రధాన అజెండా గా సాగనుంది.  దీనికి 6000 మంది ఫార్మా రంగ ప్రతినిధులు , 100 మంది ఫార్మా కంపెనీల అధిపతులు, 40 మంది యూరొప్ కి చెందినా వివిధ డ్రగ్ రెగ్యులేటరీ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు.

ఈ సమావేశంలో కెసిఆర్ 100మంది ఫార్మా కంపెనీల అధిపతులతో కలిసి భోజనం చెయనున్నరు. అలాగే ముచ్చర్ల లో 11వేల ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటి గురించి వివరించనున్నారు. ఇప్పటికే దేశ ఫార్మా ఉత్పత్తిలో 30%, ఎగుమతులలో 20% హైదరాబాద్ నుండి జరుగుతోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post