గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పై విడుదల

గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పై విడుదల
గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పై విడుదల
  • 3 సంవత్సరాల తర్వాత గాలికి బెయిల్
మైనింగ్ టైకూన్, కర్ణాటక లో శక్తివంతమైన రాజకీయ నాయకుడైన గాలి జనార్ధన్ రెడ్డి ఇవాళ బెంగళూరు సమీపం లోని పరప్పణ అగ్రహార జైలు నుండి బెయిల్ పై విడుదల అయ్యారు. మూడు సంవత్సరాల పాటు జైలులో వున్న అతను 2013 మార్చ్ లో హైదరాబాద్ జైలు నుండి బెంగళూరు జైలు కు మార్చబడ్డాడు.

జనార్ధన్ రెడ్డి విడుదలయ్యే సమయం లో భారీ ఎత్తున అనుచరులు రావటం తో జైలు బయట ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 48 సంవత్సరాల గాలి జనార్ధన్ రెడ్డి పై అవినీతి, అక్రమ మైనింగ్ కేసులు వున్నాయి. తన రాజకీయ పలుకుబడి ని ఉపయోగించి ఇవన్నీ చేసారని ఆరోపణలు వున్నాయి. అతనిపై వున్న అన్ని కేసులలో సాక్ష్యాధారాలు సేకరించటం పూర్తయిందని CBI తెలిపిన తర్వాత బెయిల్ లభించింది. జనార్ధన్ రెడ్డి సెప్టెంబర్ 2011 లో తను అరెస్ట్ అయ్యే కొన్ని నెలల ముందు వరకు రాష్ట్ర మంత్రి గా పని చేసారు. ఇతనికి ఇద్దరు సోదరులతో కలిపి బళ్ళారి లో ఇనుప ఖనిజ గనులు వున్నాయి .

జనార్ధనరెడ్డి, అతని అన్న కరుణాకర్ రెడ్డి ఇద్దరూ 2011 జూలై వరకు యడియూరప్ప సారధ్యం లోని కర్ణాటక బిజెపి ప్రభుత్వం లో మంత్రులు గా వున్నారు. లోకాయుక్త సంతోష్ హెగ్డే ఆదేశాలతో వారు మంత్రి పదవులను వదులుకున్నారు. వీరిపై అక్రమ మైనింగ్, ఆంధ్రప్రదేశ్ నుండి బళ్ళారి కి ఐరన్ ఒర్ తరలింపు, రాష్ట్రాల సరిహద్దులు మార్చటం, ఇతర మైనింగ్ కంపనీలనుండి బలవంతపు వాటాలు తీసుకోవటం వంటి ఆరోపణలు వున్నాయి.

సాధారణ కానిస్టేబుల్ కుమారులైన ఈ ముగ్గురు గాలి సోదరులు 1999 లో సుష్మా స్వరాజ్ బళ్ళారి లో సోనియాగాంధి పై పోటీ చేసిన సందర్బం లో బిజెపి అధిష్టానం దృష్టిలో పడ్డారు. 2008 లో బిజెపి కర్ణాటక లో అధికారంలోకి రావటానికి వీరి ధనబలం కూడా ఒక కారణం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post