హాస్య నటుడు ఎంఎస్ నారాయణ ఇక లేరు

హాస్య నటుడు ఎంఎస్ నారాయణ ఇక లేరు
హాస్య నటుడు ఎంఎస్ నారాయణ ఇక లేరు
నటుడు, కమెడియన్ గా 750 సినిమాల్లో నటించిన ఎంఎస్ నారాయణ శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో మరణించారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. ఎంఎస్ నారాయణ కు ఒక కూతురు (శశికిరణ్), ఒక కుమారుడు (విక్రమ్) వున్నారు.

శరీరభాగాలు పనిచేయక పోవటమే అతని మృతికి కారణం అని డాక్టర్లు తెలిపారు. భీమవరం లో ఫుడ్  పాయిజనింగ్ తో హాస్పిటల్ లో చేరిన ఎంఎస్ నారాయణ కు మలేరియా కూడా వుండటం తో ముందు బెజవాడ కు, తర్వాత అక్కడి నుండి హైదరాబాద్ కు తరలించారు. హాస్పిటల్ లో చాతి నొప్పి రావటం, కిడ్నీలు పని చేయకపోవటం తో డయాలసిస్ చేసారు. రెండు రోజులుగా వెంటిలేటర్ పైనే వున్నారు. గురువారం సాయంత్రం పరిస్థితి విషమించటం తో ఒక దశ లో మీడియా లో అయన మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన శుక్రవారం ఉదయం 9:40 గంటలకు తుదిశ్వాస వదిలారు.

తెలుగు హాస్య నటుల్లో ఎంఎస్ నారాయణది ప్రత్యెక శైలి

ఏప్రిల్ 16, 1951 లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర నిడమర్రు లో జన్మించిన ఎంఎస్ నారాయణ పూర్తి పేరు మైలవరపు సూర్య నారాయణ. ఆయన లెక్చరర్ గా పని చేసే రోజుల్లో నాటకాలకు సంభాషణలు రాసేవారు. రచయిత గా సినిమా రంగానికి వచ్చిన ఎంఎస్ నారాయణ హాస్య నటుడిగా మారి తనదైన ప్రత్యెక శైలి ని పరిచయం చేసారు.

ఐదు నంది అవార్డులు

ఎంఎస్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే ఐదు సార్లు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అతనికి నంది అవార్డు సాధించి పెట్టిన సినిమాలు
మా నాన్నకి పెళ్లి
రామసక్కనోడు
సర్దుకుపోదాం రండి
శివమణి
దూకుడు


ఎంఎస్ నారాయణ కొన్ని తమిళ చిత్రాలలో కూడా నటించారు. తన కుమారుడు విక్రమ్ హీరోగా నటించిన కొడుకు సినిమాకు దర్శకత్వం వహించాడు. భజంత్రీలు అనే మరో సినిమాకు కూడా దర్శకత్వం చేసారు. ఆయన ఎనిమిది తెలుగు చిత్రాలకు సంభాషణలు సమకూర్చారు.

ఎర్రగడ్డలో అంత్యక్రియలు

ఎంఎస్ నారాయణ గారి పార్థివ దేహాన్ని నిన్న అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్ వద్ద ఉంచారు. అయన అంత్యక్రియలు ఇవాళ ఎర్రగడ్డ లోని స్మశాన వాటిక లో జరగనున్నాయి. ఈ మధ్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఈ 45 రోజులలోనే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ పిజే శర్మ, నటుడు ఆహుతి ప్రసాద్ మరియు నిర్మాత దర్శకుడు రాజేంద్రప్రసాద్ లు పరమపదించారు.

ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల సంతాపం

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎంఎస్ నారాయణ మృతి కి సంతాపం తెలియచేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విచారం వ్యక్తం చేసారు. ప్రతిపక్షనేత వైఎస్ కూడా విచారం వ్యక్తం చేసి కుటుంబానికి దైర్యం చెప్పారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post