e-commerce సంస్థల దూకుడు ఇండియాలో వాణిజ్య స్థలాల బూమ్ కు దారితీయనుందా?

e-commerce సంస్థల దూకుడు ఇండియాలో వాణిజ్య స్థలాల బూమ్ కు దారితీయనుందా?
e-commerce ఇండియాలో వాణిజ్య స్థలాల బూమ్
ఇంటర్నెట్ రిటైల్ దిగ్గజం Amazon, దాని దేశీయ పోటీదారు Flipkart, ఇంకా ఇతర e-commerce సంస్థలు దేశంలో వాణిజ్య స్థలాల అద్దెలు పెరగటానికి కారణం అవుతున్నాయి. 2013 తో చూస్తె  2014 లో ఈ సంస్థల వాణిజ్య స్థలాల అవసరం 7రెట్లు పెరిగింది. దీనితో అద్దెలు 25% పెరిగాయి. బెంగళూరు లో రానున్న 6నెలల కాలం లో ఈ అద్దెలు ఇంకో 20% పెరగనున్నాయి.

గత అక్టోబర్ లో flipkart 32.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకోవటానికి ఎంబసీ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద వాణిజ్య స్థలాలకు సంబందించిన డీల్. ఎంబసీ గ్రూప్ చైర్మన్ జితేంద్ర విర్వాణి తెలిపిన వివరాల ప్రకారం ఇంకా వాణిజ్య స్థలాల కోసం e-కామర్స్ సంస్థల నుండి డిమాండ్ పెరగనుంది.

Amazon కూడా బెంగళూరు లో 10లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం అద్దెకు తీసుకోనుంది. Quickr కూడా 50వేల చదరపు అడుగుల వాణిజ్య స్థలం కావాలనుకుంటోంది. Pepperfry మరియు Fabfurnish కూడా స్థలాల వేటలో వున్నాయి. e-commerce రంగం ఇంకా ప్రాథమిక దశలోనే వున్న ఈ సమయం లోనే ఇంత డిమాండ్ వుంటే భవిష్యత్ ఇంకా డిమాండ్ పెరగవచ్చు అనేది అంచనా.

0/Post a Comment/Comments

Previous Post Next Post