మలేసియా ప్రధాని తో చంద్రబాబు భేటి |
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో పాల్గొనటానికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అక్కడ మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ తో భేటి అయి రాష్ట్రం లో గల పెట్టుబడి అవకాశాలను గురించి వివరించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మలేసియా మాజీ ప్రధాని మహతీర్ మొహమ్మద్ తో తనకు అనుబందాన్ని వివరించి రాష్ట్ర అభివృద్ధికి అతను చేసిన సహాయాన్ని కొనియాడారు.
ముఖ్యమంత్రి మలేసియా ప్రధాని కి రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రం యొక్క అభివృద్ధి అవకాశాలను వివరిస్తూ రాష్ట్రాన్ని Gate way of east coast గా అభివర్నించారు. ఆయిల్ పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం లోవున్న విషయాన్ని తెలుపుతూ మౌలిక సదుపాయాల వృద్ధిలో సహాయం కోరారు. రాష్ట్రం లో బుద్దిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు , టూరిజం అభివృద్ధికి మలేసియా సహాయాన్ని ఆకాంక్షించారు. ఈ విన్నపాలకి సానుకూలంగా స్పందించిన మలేసియా ప్రధాని రాష్ట్రం లో పెట్టుబడి అవకాశాలను అధ్యయనం చేయటానికి ఒక బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారు.
Post a Comment