కుల పత్రికలు - గుల పత్రికలు

కుల పత్రికలు - గుల పత్రికలు
కుల పత్రికలు - గుల పత్రికలు
తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు మన తెలంగాణా దినపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణా కు ప్రత్యేకించిన మరిన్ని పత్రికల అవసరం ఉందంటూ, మన తెలంగాణా పత్రిక రావటం సంతోషకరమన్నారు. అలాగే విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాలనీ, మంచిపని ఎవరు చేసినా ప్రచారాన్ని కల్పించాలనీ, సమాజం లో నిర్మాణాత్మక పాత్రను పోషించాలనీ ఉద్భోదించారు.

రాష్ట్రం లో కొన్ని కుల పత్రికలు, మరికొన్ని గుల పత్రికలు ఉన్నాయనీ, అవి కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రాన్ని అస్థిరపరిచే ఉద్దేశ్యం తో పని చేస్తున్నాయనీ వ్యాఖ్యానించారు.

మన తెలంగాణా ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలకు సంబందించిన 18నెలల నిబంధన ను ఎత్తివేయటం తమకు సంతోషకరం అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post