ఎవరు ద్రోహులు? |
ఈమద్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదం తెలంగాణా ద్రోహులు. దీనిని అన్ని రాజకీయ పక్షాలు తమ అవసరార్దం ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నాయి.
ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సమితి నే తీసుకుంటే ఆ పార్టీ తెలంగాణా ఏర్పడే వరకు కొండా సురేఖ, మహేందర్ రెడ్డి మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ లను తెలంగాణా ద్రోహులంటూ దుమ్మెత్తిపోసేది. ప్రస్తుతం మారిన పరిస్థితులలో ఈ ముగ్గురూ తెరాస తీర్థం తీసుకోవటమే కాకుండా ఏకంగా మంత్రులు కూడా అయ్యారు. తెరాస లో చేరితే ద్రోహులు కూడా పునీతులు అయిపోతారేమో?
ఇక తెదేపా విషయానికి వస్తే తెరాస తెలంగాణా ద్రోహులకు మంత్రి పదవులిచ్చింది అంటూ నోరు పారేసుకుంటూ వుంటుంది. ఇవాళ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు అదే వ్యాఖ్యానించారు. అసలు వాళ్ళు ఎక్కడినుండి వచ్చారు అనే విషయం అప్రస్తుతం గా అనిపిస్తుందేమో? లేకపోతె వీళ్ళ పార్టీ లో వున్నన్ని రోజులు కడిగిన ముత్యాల్లాంటి వాళ్ళు, వాళ్ళ పార్టీ లో చేరగానే ద్రోహులైపోయారేమో?
ఈ రాజకీయ నాయకులందరూ ప్రజలకి జ్ఞాపక శక్తి చాలా తక్కువని భావిస్తారేమో?

Post a Comment