దేశపతి వ్యాఖ్యల దుమారం

దేశపతి వ్యాఖ్యల దుమారం
దేశపతి వ్యాఖ్యల దుమారం
ప్రముఖ కవి, గాయకుడు, తెలంగాణా ప్రభుత్వంలో సిఎం కి OSD గా పనిచేసే దేశపతి శ్రీనివాస్ గారు మెదక్ జిల్లా సంగారెడ్డి లో తెలంగాణా పునర్నిర్మాణం అభివృద్ధి అనే అంశం పై మాట్లాడుతూ "సమాజాన్ని వుద్దరించాలని సందేశాత్మక సినిమాలు తీస్తే చంకనాకి పోతాయని హీనంగా మాట్లాడిన పూరి జగన్నాథ్ చెంప చెళ్ళుమనిపించాలి." అన్నారు. అంతే కాకుండా సీమాంధ్ర దర్శకులు తీసే సినిమాలు ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, మహిళలను అవమానపరిచే విధంగా ఉంటున్నాయని, ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించారదనీ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో విస్తృతం గా వార్తలు వచ్చాయి. ఇష్టం లేకపోతే ఖండించాలి అంతేకాని చెంప చెళ్ళుమనిపించాలి అనడం సబబు కాదని, ఒకరిద్దరు దర్శకులు చేసినదానికి సీమాంధ్రను అనడం సరికాదని వార్తలు వినిపించాయి.

అసలు దేశపతి గారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసారు.  సిఎం కి OSD గా వున్న వ్యక్తి ఒక డైరెక్టర్ ఏదో అన్నాడని వ్యాఖ్యానించటం ఏమిటి? సినిమాల సంగతి ఎలా వున్నా అసలు పూరి జగన్నాథ్ గారు దేశపతికి, ఇతర తెలంగాణా వాదులకి పెద్దగా నచ్చరు. వీళ్ళందరికీ అతనిపై స్వాభావికమైన విముఖత వుంది. ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయం లోనే వారి మనోభావాలను దెబ్బతీసే CMGR సినిమా తీయటమే దీనికి కారణం. అతన్ని తెలంగాణా వ్యతిరేకిగానే భావిస్తారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post