దావోస్ లో ఇన్వెస్టర్లను మెప్పించిన చంద్రబాబు

దావోస్ లో ఇన్వెస్టర్లను మెప్పించిన చంద్రబాబు
దావోస్ లో ఇన్వెస్టర్లను మెప్పించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో ఐటి, పర్యాటకం, మౌలిక సదుపాయాలు మరియు ఆయిల్ రిఫైనరీ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రయత్నించారు. దావోస్ లో చంద్రబాబు ఇలా చెప్పారు "నేను ప్రపంచం లోని పెట్టుబడి దారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండియా ఒక అవకాశాల నిలయం. ఇండియాలో పెట్టుబడి పెట్టేముందు ఆంధ్రప్రదేశ్ ని పరిగణలోకి తీసుకోండి."

మీ రాష్ట్రానికే ఎందుకు రావాలన్న ప్రశ్న కు సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ నూతన అవకాశాలకు ట్రెండ్ సెట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ విస్తృతమైన మానవ వనరులు, సహజ వనరులు వున్నాయి. అన్నారు. 

అలాగే రాజధాని నిర్మాణం ఆక్షన్ ప్లాన్ తయారు చేసే బాద్యత సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించామని, నిర్మాణం జపాన్ కంపెనీలు చేపదతాయని చెప్పరు. ప్రపంచం లోని చాల కంపెనీలు రాష్ట్రంలో మౌలిక వసతులు నిర్మించటానికి ముందుకు వస్తున్నాయని వివరించారు. ప్రపంచంలోనే అత్యద్బుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post