ఎంఐఎం బలపడటం ఎవరికి లాభం?

ఎంఐఎం బలపడటం ఎవరికి లాభం?
ఎంఐఎం బలపడటం ఎవరికి లాభం?
  • ఎంఐఎం దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలు
  • ఇతర పార్టీల్లో గుబులు
ఎంఐఎం పార్టీ తెలంగాణా ని దాటి దేశ వ్యాప్తం గా విస్తరించటానికి సన్నాహాలు చేస్తుంది. ఈమద్య మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసి రెండు సీట్లు గెలవటమే దీనికి సంకేతం. ఈ పార్టీ నిజంగానే ముస్లిం జనాభా వున్న చోట్ల పాగా వేయగలుగుతుందా?, ఒక వేళ అలా చేయగలిగితే ఎవరికి లాభం?,ఎవరికి నష్టం?

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసి నుండి ఈ మద్య ప్రపంచం లో పుట్టిన వారందరూ ముస్లింలే అనే ప్రకటన విన్నాం. అలాగే బీజేపి నేత సాధ్వి జ్యోతి నుండి ఇండియా లో పుట్టిన వారందరూ రాముని బిడ్డలే అనే స్టేట్మెంట్ విన్నాం. ఈ ప్రకటనలలో లాగే వారి పార్టీ విధానాల్లో బద్దవ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ ఈ రెండు పార్టీల ఎదుగుదల లో సంబంధం ఉంది. ఈ రెండు పార్టీలు మాట సంబందమైన బావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడే ఎదుగుతాయి. బీజేపి బలపడటం అనేది ఒక విధంగా ఎంఐఎం బలపడటానికి దోహదం చేస్తుంది. ఈ ధోరణి అంతిమంగా లౌకిక పార్టీలుగా చెప్పుకునే మద్యేవాద పార్టీలైన కాంగ్రెస్, ఎస్పీ, బిఎస్పీ వంటి పార్టీలకు నష్టం కలిగిస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post