20వేల కోట్లకు చేరనున్న రెవెన్యూ లోటు

24వేల కోట్లకు చేరనున్న రెవెన్యూ లోటు
24వేల కోట్లకు చేరనున్న రెవెన్యూ లోటు
  • 16వేల కోట్ల భర్తీ కి కేంద్రం వద్ద ప్రయత్నాలు
  • ఇప్పటి వరకు రూపాయి కూడా విదిలించని కేంద్రం

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదించిన 16000కోట్ల రెవిన్యూ లోటు ను కేంద్రం వద్ద సాధించటానికి నిరంతరాయ ప్రయత్నాలు చేస్తూ వుంది. ఇప్పటివరకు కేంద్రం నుండి రూపాయి కూడా రాకపోగా ముందస్తు అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 20వేల కోట్ల కి చేరుకునే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టప్రకారం 12,391కోట్ల రూపాయలను కేంద్రం వద్ద నుండి ఆశిస్తుంది. ప్రణాళికేతర వ్యయం అదుపులో లేకపోవటం, రెవిన్యూ వసూళ్ళు ఆశించిన స్థాయి లో ఉండకపోవటం తో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం గా తయారయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుండి వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి తో ఈ విషయం చర్చించనున్నారు.

ఈ దయనీయ పరిస్థితి నుండి బయటపడటానికి కేంద్రం కనీసం 2-3వేల కోట్లయినా ఇస్తుందని అనుకుంటున్నారు. దీనిలో సగం గ్రాంటు గా సగం లోనుగా వచ్చే అవకాశం వుంది. అలాగే ప్రతి వెనుకబడిన జిల్లాకి 50 నుండి 100 కోట్ల వరకు ప్యాకేజీ ఇస్తుందని అశిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి రావలసి వుంది. కానీ సాంకేతిక కారణాల వలన అది కార్య రూపం దాల్చే అవకాశం లెదు. కేంద్రం ఈ రాష్ట్రాలకు కొన్ని పారిశ్రామిక రాయితీలు ప్రకటించే అవకాశం వుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post