శ్రీసిటీ ఆంధ్రప్రదేశ్ కు సిరులు కురిపించనుందా?

Sricity
Sri City
  • పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్న సెజ్
  • తమిళనాడు ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు 
శ్రీ సిటీ చెన్నై కి ఉత్తర దిశగా 55 కిలో మీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పబడిన SEZ. రాష్ట్రం లో పెట్టుబడులకి కొత్త గమ్యస్థానంగా మారిపోయిందా?. తమిళనాడు కి ముఖ్య గా చెన్నై,పెరంబుదూరు-ఒరగుడం ఇండస్ట్రియల్ ఏరియా తో పోటీలో ముందుకు దూసుకు పోతుందా? గణాంకాలు, కొత్తగా నెలకొల్పబడిన పరిశ్రమలు అవుననే అంటున్నాయి.

అసలేమిటీ శ్రీ సిటీ

శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో NH5 పక్కన 5000 ఎకరాల పరిధి లో విస్తరించివుంది. సముద్ర మట్టానికి దాదాపు 20 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం లో సింగపూర్ జురాంగ్ కన్సల్టెన్సీ వారి సహకారం తో APIIC ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ని ఏర్పాటు చేసింది. శ్రీ సిటీ లో ఇప్పటికే 100కు పైగా కంపనీలు తమ 18000 కోట్ల రూపాయల తో తమ కార్యకలాపాలు కొనసాగించటానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటిలో 25దేశాలకు చెందిన 45 మల్టీ నేషనల్ కంపెనీలు ఉన్నాయి.

ఇప్పటికే ఇక్కడ జపాన్ కి చెందిన ఇసుజు తో పాటు కుబెల్కో,అల్-స్టోమ్ తమ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కాడ్బరీ, పెప్సికో, కెల్లాగ్స్ తదితర ఆహార, పానీయ ఉత్పాదక సంస్థలు కూడా తమ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

శ్రీ సిటీ అనుకూలతలు
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు మరియు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం
  • తమిళనాడు తో పోలిస్తే సత్వర అనుమతులు, నిరంతరాయ విద్యుత్ సరఫరా
  • ఎన్నోర్(24Km), చెన్నై(40Km) మరియు కృష్ణపట్నం(100Km) పోర్ట్ లకు సమీపం లో ఉండటం, పోర్ట్ లకు వెళ్ళటానికి ట్రాఫిక్ సమస్యలు లేకపోవటం
  • చెన్నై,తిరుపతి ఎయిర్ పోర్ట్ లనుండి కేవలం 90నిమిషాల దూరం
  • NH5 మరియు రైల్వే సదుపాయాలు
  • చెన్నై తో పోలిస్తే 40% తక్కువ పెట్టుబడి తో కంపెనీ స్థాపించే అవకాశం

తమిళనాడు ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు 

తమిళనాడు ప్రభుత్వం కూడా సత్వర అనుమతులు ఇవ్వడానికి, విద్యుత్ సరఫరా మెరుగు పరచటానికి చర్యలు చేపట్టింది. అంతేకాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ల ప్రత్యెక ప్రతిపత్తి ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ కూడా రాసింది. శ్రీ పెరంబుదూర్ - ఒరగడం ఇండస్ట్రియల్ క్లస్టర్ లో ఇప్పటికే  హ్యుండై, డైమ్లెర్, రెనాల్ట్ -నిస్సాన్, అశోక్-లేలాండ్ కంపెనీలు ఉన్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post