ఎలా చెప్పను?


ఎలా చెప్పను?
ఎలా చెప్పను?
నా కళ్ళలో
కళ్ళు పెట్టి చూసి అడిగావు నేనెవరినని?


ఎలా చెప్పను?..........నేనే   
తన పెదాలఫై చిరునవ్వునని,
తన కురులలో పువ్వునని,
తన మనసు లో అనుభూతినని,
తన దుఃఖం లో అశ్రువునని,


ఎలా చెప్పను?..........  
తనే ఓ పుష్పమయితే,
నే తన లోని మకరందాన్నని,
తనే మకరందమయితే,
నే తూనీగనని,


ఎలా చెప్పను?..........
తనే నా హృదయమని,
తనే నా రంగుల హరివిల్లనీ......

0/Post a Comment/Comments